ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలుచేసూడే : కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

చేతు గుర్తు కు మీరు  ఓట్లు వేసుడే 

రాజేందర్ రావు ను గెలిపించుడే 

సిరిసిల్ల  శాసనసభ  నియోజకవర్గం  కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా మేము అమలు చేసుడే మీరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ఉపాధి హామీ కూలీలను స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థించారు,

అక్కపల్లి , హారిదాస్ నగర్,  వెంకటాపురం గ్రామాల్లో మంగళవారం ఉదయం ఉపాధి హామీ కూలీల  దగ్గరికి కేకే మహేందర్ రెడ్డి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు, 

ఈ సందర్భంగా కూలీలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు  కూల్ డ్రింక్స్, చల్ల ప్యాకేట్లను పంపిణీ చేశారు , ఈ సందర్భంగా కొందరు కూలీ లు  గృహిజ్యోతి పథకం కింద మహిళలకు  2500 పెన్షన్ ఇస్తామని ఇవ్వకపోతిరని కొందరు మహిళలు కేకే ను ప్రశ్నించారు,,,,,, ఉచిత విద్యుత్తు  జీరో బిల్లు అంటిరీ మాకు జీరో బిల్లు రావటం లేదనీ కొందరు మహిళలు కేకే మహేందర్ రెడ్డి తో వాపోయారు,

అదే విధంగా  500 రూపాయల గ్యాస్ పథకం తమకు ఇంకా రావడంలేదని  కొందరు మహిళలు  ఆయనతో  గుర్తు చేయగా ఎన్నికల కోడ్  వల్ల ఆరుగ్యారెంటీలు కొందరికి అంద  లేదని ఎన్నికల అనంతరం కచ్చితంగా జూన్  నెలలో అమలు చేసి తీరుతామని  కేకే మహేందర్ రెడ్డి మహిళలకు నచ్చజెప్పారు , చేతు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్రావును  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేకే మహేందర్రెడ్డి మహిళలను అభ్యర్థించారు,

ఉచిత బస్సు ప్రయాణం బాగానే ఉందనీ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కొందరు  మహిళలు కితాబిచ్చారు,

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య,  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , ఆయా గ్రామ శాఖల అధ్యక్షులు భూమిరెడ్డి , పరశురాములు పొన్నాల తిరుపతిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు పోన్నాల అంజిరెడ్డి,  మల్లారెడ్డి , వడ్నాల బాలయ్య,  కంకణాల శ్రీనివాస్,  గోట్టెపల్లి రాజయ్య , పండాల నరేష్ రెడ్డి,  మల్లేశం,  మామిళ్ల ఆంజనేయులు  తదితరులు పాల్గొన్నారు

.