బాన్సువాడ బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ.
తెలంగాణ ప్రభ( కోటగిరి): జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండల కేంద్రంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి బాన్సువాడ బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండల లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. గత పది ఏళ్లలో కేంద్రంలోని బిజెపి సర్కారు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి పార్టీ చేపట్టబోయే పనులకు సంబంధించిన మేనిఫెస్టోను ఉపాధి కూలీలకు వివరించారు. ఉపాధి కూలీల వద్దకు బిజెపి నాయకులు మోడీ మాస్కులు ధరించి వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం కోసం మోడీ మోడీ కోసం మనం అనే నినాదంతో బిజెపి నాయకులు మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు చదివి వినిపించారు. అనంతరం మండల బిజెపి పార్టీ కార్యాలయంలో మండల కేంద్రానికి చెందిన కొందరు యువకులు బిజెపి పార్టీలో చేరారు. బిజెపి పార్టీలో చేరిన వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.... 60 ఏళ్ల కాంగ్రెస్ పలనా కాకుండ గత పది ఏళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇతర దేశాలకు భయపడుతూ భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో కనీస గుర్తింపు తీసుకు రావడంలో విఫలమయ్యారని మండి పడ్డారు. మోడీ వచ్చాక గత పది సంవత్సరాలుగా భారతదేశం ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచ దేశాలు ప్రస్తుతం భారతదేశాన్ని చూసి మోడీ లాంటి పవర్ ఫుల్ నాయకుడు తమకుంటే బాగుంటుందని అనుకుంటున్నారన్నారు. కరోనా కష్ట సమయంలో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి మోడీ ప్రభుత్వం ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వడం కాకుండా ఇతర దేశాలకు సైతం టీకాలు సరఫరా చేసి అండగా నిలిచిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వం అనుసరించిన పాలన విధానాలు మోడీని యూనివర్సల్ లీడర్ గా మీరు తెచ్చాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో మోడీ మానియా నడుస్తుందని మరోమారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ఈసారి నాలుగు వందలకు పైగా ఎంపీలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోసారి బీబీ పాటిల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలకు కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు శ్యామల కులకర్ణి ,బిజెపి బాన్సువాడ నియోజకవర్గం కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్ ,కో కన్వీనర్ గాండ్ల శ్రీనివాస్, కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్, సీనియర్ బిజెపి నాయకులు పుల్లెల మోహన్ రావు, మామిడి శ్రీనివాస్, హౌగిరి రావు దేశాయ్, ఎమ్మార్పీఎస్ నాయకులు దవులయ్య, గోగినేని శ్రీనివాస్,భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
.