కాంగ్రెస్ పార్టీ లో చేరిన అక్క పెళ్లి , గుండారం గ్రామాల కు చెందిన పలువురి చేరిక

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం గుండారం , అక్కపెల్లి గ్రామాలకు  చెందిన  బిఆర్ఎస్ పార్టీ , బిఎస్పీ పార్టీ లకు చెందిన నాయకులు కార్యకర్తలు సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి స‌మక్షంలో   సోమవారం  సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  చేరారు ,

అక్క పెళ్లి గ్రామ శాఖ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  భూంరెడ్డి ఆద్వర్యంలో. 20 మంది కాంగ్రెస్ పార్టీ లో చేరగా  వారికి కే కే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు, 

అదేవిధంగా గుండారం  గ్రామశాఖ  కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు బానోత్ రాజు నాయక్, జజ్జరి నర్సయ్య  ల ఆద్వర్యంలో ఆరుగురు  కాంగ్రెస్ పార్టీ లో  చేరగా వారికి  కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు,

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయి, మాలోత్ రామచందర్ నాయక్ , మందాటి దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు  బండారి బాల్ రెడ్డి ,జంకె లచ్చి రెడ్డి , మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు

.