తెలంగాణ ప్రభ( సిరిసిల్ల): రాముడిని మొక్కండి బిజెపిని తొక్కండి అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామా రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పలు కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ రాముడిని మొక్కలని మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపి తొక్కలని అన్నారు. పలుకు రాజకీయ అంశాలను ప్రస్తావించారు. బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పలురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
