తెలంగాణ ప్రభ (సిరిసిల్ల): రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి సిరిసిల్ల జిల్లా మారుస్తారంటూ ప్రచారం చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు టోనీ అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమంలో లేని కొందరు నాయకులు జిల్లా పోతుందంటూ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు పలికిన సీఎం రేవంత్ రెడ్డి జిల్లాను ఎలా ఎత్తేస్తారని అన్నారు. ప్రజల్లో పలుచబడ్డ బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని అన్నారు. సమావేశంలో నాయకులు బైరినేని రాము, కంసాల మల్లేశం, పోకల సాయికుమార్, సోమిశెట్టి దశరధం, లింగంపల్లి మధుకర్ పాల్గొన్నారు.
