కాంగ్రెస్ ఎంపీని గెలిపించండి.
తెలంగాణ ప్రభ(.కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో వ్యాపార సముదాయాలకు వెళ్లి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్. షేట్కార్ గెలిపించాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ దుభాస్. రాములు, సిపిఐ మండల కార్యదర్శి ఏ. విటల్ గౌడ్ మాట్లాడుతూ... ఇండియా కూటమిలో సిపిఐ భాగస్వామిగా ఉన్నదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని వారు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల్లో చేపట్టపోయే పథకాలపై ప్రచారం నిర్వహించారు. పదేళ్ల కాలంలో బిజెపి ప్రభుత్వం రైతులకు కార్మికులకు వ్యతిరేకంగా పరిపాలన చేసిందని వారు విమర్శించారు దేశంలోని 22 మంది బడా పెట్టుబడిదారులకు 10 ఏళ్ల కాలంలో బిజెపి ప్రభుత్వం 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిందని వారు తెలిపారు. బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలని వారు దుకాణ సముదాయ యాజమాన్యులకు ఓటర్లకు కోరారు . సిపిఐ కార్యకర్తలు ప్రజా సంఘాల సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని వారు తెలియజేశారు. ఈ ప్రచారంలో నల్ల గంగాధర్, బుడాల రాములు, గంపల హనుమాన్లు, రాజు, అంజా గౌడ్, సున్నం భరత్ తదితరులు పాల్గొన్నారు.
