బిజెపి - కాంగ్రెస్ లను బొంద పెట్టాలే

దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తుండ్రు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే దొంగ హామీలతో మోసం చేసిండ్రు

ప్రజల మనిషి వినోద్ కుమార్ ని గెలిపించండి

జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో సోమవారం జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలని అన్నారు, ఎన్నికలు వచ్చినప్పుడు దొంగ హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని బిజెపి కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించారు, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బోయిన్పల్లి వినోద్ కుమార్ ను అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించి మన సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాను తొలగిస్తాను అనడం విడ్డూరంగా ఉందని అన్నారు, జిల్లాలో సుపరిపాలన జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ ఆరు గ్యారంటీలను అమలు చేయకపోగా వాటిని ఎండగాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు, వెంకటాపూర్ గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించిన అనంతరం ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు, సానుకూలంగా స్పందించిన గ్రామస్తులు కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయామని, పార్లమెంటు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందే సుభాష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

.