తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండలంలోని హంగర్గ ఫారం గ్రామంలో ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ ఎజాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ.. గత 10 ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. బాన్స్ వాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గెలుపుతో నియోజకవర్గంలోని మండలాలను అభివృద్ధి చేసుకోవడం సాధ్యమైతుందని అన్నారు. స్థానికంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ఉండటంతో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీని గెలిపించుకుంటే మరింత నియోజకవర్గలోని గ్రామాలు అభివృద్ధి చేసుకోవటానికి అవకాశం ఉంటుందని ఓటర్లకు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాటలు నమ్మి చేతు గుర్తుకు ఓటు వేసి మోసపోవద్దని ఓటర్లకు తెలిపారు. ఈ ప్రచారంలో పాల్గొన్న వారు మాజీ సర్పంచ్ దిలీప్ కుమార్, సూరారెడ్డి మైనార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
