బి ఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండల పరిధిలోని పలు గ్రామాలలో బి ఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి 

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం నాడు హత్నూర మండలం లోని పలు గ్రామాలలో నర్సాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు గడిచిన చెప్పిన మాటలు ఒక్కటి ఈడ నిలబెట్టుకోకపోవడం చాలా సిగ్గుచేటు అన్నారు ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు మహిళలకు 2500 కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వృద్ధాప్య వితంతు పింఛన్లు పెంచుతానని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయకపోవడం చాలా బాధాకరమన్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అభ్యర్థి మన వెంకటరామిరెడ్డి గారిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు సూచించారు అధికారంలోకి మన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు రావడం ఖాయమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ దేవేందర్ రెడ్డి హత్నూర మండల్ ఎంపీపీ నర్సింలు యాదవ్ నాయకులు రమేష్ నాయక్ అర్జున్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

.