ఎన్నికలు సజావుగా సాగేలా అందరు సహకరించాలి : ఎస్సై సుధాకర్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తంగళ్లపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని తంగళ్లపల్లి ఎస్సై డి.సుధాకర్ కోరారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మరియు రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు  ఉన్న గ్రామాల్లో తంగళ్లపల్లి ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది తో కలిసి తాడూరు,  తంగళ్లపల్లి, మండేపల్లి గ్రామాలలో కవాతు నిర్వహించి ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ మండలంలో మొత్తం 35 పోలింగ్ ప్రదేశాల్లో 50 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గ్రామాలలో కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి కవాతు నిర్వహించడమే కాకుండా ప్రజలకు ఎన్నికల పట్ల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్నికల సమయంలో పార్టీల నాయకులు గాని, ప్రజలు గాని, యువకులు గాని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించకుండా ప్రచారాలు నిర్వహించుకోవచ్చు అని, ఎన్నికల ప్రవర్తన నియమావలిని ఉల్లంగించినట్లైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఎన్నికలలో కేసులు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావని మరియు విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ కు ఇబ్బంది ఉంటుందని గనుక అందరూ జాగ్రత్తలు వహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి ఏఎస్సై చంద్రమౌళి, హెడ్ కానిస్టేబుళ్లు సాంబశివరావు, సుధాకర్, మల్లేశం, కానిస్టేబుళ్లు నరేందర్,రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్, రామ్మోహన్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

.