ఎల్లారెడ్డిపేట టౌన్ బిజెపి అధ్యక్షునిగా నంది నరేష్

అధికారిక పత్రాన్ని అందజేస్తున్న మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి

తెలంగాణ ప్రభ (ఎల్లారెడ్డిపేట): బిజెపిఎల్లారెడ్డిపేట టౌన్ అధ్యక్షునిగా నంది  నరేష్ ను నియమిస్తున్నట్లు మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి శనివారం తెలిపారు అనంతరం నియామక పత్రాన్ని బిజెపి నాయకులు శనివారం రోజు నరేష్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి తన నియామకానికి సహకరించిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కు మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి మరియు బిజెపి నాయకులకు కార్యకర్తలకు నరేష్ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని  పేర్కొన్నారు.తన నియామక పత్రాన్ని మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి అందజేశారు.  .ఈకర్యకరమంలో చందుపట్ల లక్ష్మారెడ్డి,కిరణ్ నాయక్,వంగ శ్రీకాంత్ రెడ్డి,గాజుల దాసు,చేకుటి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

.