కోటగిరిలో ఎన్నికల ప్రచారంలో కారు జోరు.. బిఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం..

తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులకు  దిశా నిర్దేశం చేయడంతో  జహీరాబాద్ పార్లమెంట్ గెలుపే లక్ష్యంగా భారాసా నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 10 యెడ్లలో చేసిన అభివృద్ధిని ప్రగతిని ప్రజలకు క్లుప్తంగా వివరించాలన్నారు. బిఆర్ఎస్ నాయకులు  కోటగిరి మండల కేంద్రంలో 44, వ బూత్ లో ఇంటింటికీ తిరుగుతూ కారు ప్రచారం జోరుగా నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు . మహిళలు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మడం లేదని కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్నారని కోటగిరి బిఆర్ ఎస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి బీఆర్ఎస్ అధ్యక్షులు  అనిల్ కుమార్, బూత్ కమిటీ సభ్యులు ఉదయ్, రాములు,  విజయ్,  విటల్, రాజు, పోశెట్టి, శ్రీను, మారుతి, లక్ష్మణ్ దినేష్ శ్రీకాంత్, లాలయ్య, సాయిలు, గంగారం, తదితరులు పాల్గొన్నారు.

.