తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ కాలనీ ప్రాంతానికి చెందిన బలిజ గంగారెడ్డి తృతీయ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని పలువురు నిరుపేదలకు అన్నదానాన్ని అందజేశారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గంగారెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారని వారు తెలిపారు.
ఆయన సింగిల్ విండో వైస్ చైర్మన్ గా చేసిన సమయంలో రైతులకు ఎంతో సహాయం చేశారని ఆయన సేవలను కొనియాడారు.
ఆయన లేని లోటు తీరనిదని పలువురన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీనారాయణ, బద్ది సుజాత మురళి, బలిజ పద్మా రాజారెడ్డి, అంబేద్కర్ సంఘ నాయకులు ఉయ్యాల నరసయ్య, పసుల కృష్ణ ప్రసాద్ ,ఉయ్యాల శోభన్, గోరుమంతుల సత్తయ్య, సామల వేణుగోపాల్, గడేల రాజు, బలిజ శివప్రసాద్, బుల్లె గంగాధర్, బలిజ రాజశేఖర్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.