తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కన్వీనర్ లు 39 ,40 ,41 బూత్ కేంద్రలలో తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో పై క్లుప్తంగా వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ను ఆదరించి చేతు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలను క్లుప్తంగా ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నవారు అఫ్జల్ ,ఎజాజ్ ఖాన్, సలీం ,వాహీద్, బర్ల సాయిలు, సోహెల్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
