కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల) : కోరుట్ల నియోజకవర్గం చిన్న మెటుపల్లి గ్రామంలో మంగళవారం రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో భారీగా చేరికలు జరిగాయి సుమారు మూడు వందల మంది పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్ నాయకత్వంలో జువ్వాడి కృష్ణారావు సమక్షంలోపార్టీలో చేరారు అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కార్యకర్తలందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కార్యకర్తలు సైనిక స్ఫూర్తితో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

పార్టీలో చేరిన వారిలో ఎలేటి రాజేందర్రెడ్డి, సంధి రెడ్డి తిరుపతిరెడ్డి, మామిడి తిరుపతిరెడ్డి, నాగులపల్లి రాజేశం, కాటిపల్లి అంజయ్య, బద్దం సంతోష్, ఎండి అసిఫ్, టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరగా, భారతీయ జనతా పార్టీ నుంచి పందిరి గంగాధర్, గొల్ల సంఘం పెద్దమనిషి దాసరి అంజయ్య, లడ్డురి రాజిరెడ్డి, లడ్డురి రమేష్, కురుమ సంఘం పెదగిరి సతీష్ తదితరులు చేరారు ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, సరికేల నరేష్, కాస సంజీవ్ తదితరులు ఉన్నారు

.