తెలంగాణ ప్రభ (కోరుట్ల): పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెట్ పల్లి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోరుట్ల ఎమ్మెల్యే డా.సంజయ్ మాట్లాడుతూ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే కరెంట్ సమస్య, త్రాగు,సాగు నీరు సమస్య వచ్చిందని, భవిష్యత్ లో కాంగ్రెస్ అసమర్థ విధానాలతో మరిన్ని సమస్యలు తప్పవని అందుకే ప్రజలకోసం ఉద్యమించే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండగా ఉండాలని పట్టణ ప్రజలను, వ్యాపారులను ఆయన కోరారు.
పట్టణంలోని వ్యాపారులను కలుస్తూ కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్తించారు.
బాజిరెడ్డి ప్రజలకోసం పని చేసే వ్యక్తని, వారి గెలుపు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఎంతో అవసరం అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే తెలంగాణ ప్రజలకు రక్ష అని, లేకుంటే మనని 20 ఏండ్ల వెనక్కు నెట్టే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
.