జీవన్ రెడ్డి గెలుపు కోసం బీరప్ప స్వామికి ముడుపులు కట్టిన జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, కోరుట్ల నియోజకవర్గం చిన్న మెటుపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన బీరప్ప స్వామి ఆలయంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ముడుపులు కట్టారు అనంతరం బీరప్ప పట్నల్లో పాల్గొన్నారు 

ఈ కార్యక్రమంలో  కృష్ణారావు వెంట కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతంరాజo, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్, కుర్మ ఎర్రన్న, మల్లయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు బొల్లి నరసయ్య, ఎండి రహీం, సంధిరెడ్డి అనంతరెడ్డి, నాగులపల్లి జైరెడ్డి తదితరులు పాల్గొన్నారు

.