బీజేపితోనే గ్రామాల అభివృద్ధి

బండి సంజయ్ ని మళ్లీ ఎంపీగా గెలిపించాలి

బావుసాయిపేటలో బీజేపి ఇంటింటా ప్రచారం

తెలంగాణ ప్రభ, (కోనరావుపేట); బీజీపీతోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బిజెవైఎం మండల అధ్యక్షుడు భైరగోని సురేష్ గౌడ్ అన్నారు. సోమవారం కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో బూత్ అధ్యక్షులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బండి సంజయ్ ని మరోసారి ఎంపీగా గెలిపించాలని కోరారు. బిజెపి పాలనలో దేశం సుభిక్షంగా ఉందని, ప్రజలందరూ బండి సంజయ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బండి సంజయ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే మండలంలోని సుద్దాలలో బిజెపి మండల అధ్యక్షుడు రామచంద్రం, మరిమడ్లలో బిజెపి నాయకురాలు పల్లం అన్నపూర్ణ బండిని మరోసారిగా ఎంపీగా గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు సురేష్ రావు, కృష్ణస్వామి, బీజేపీ జిల్లా నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.