ధాన్యం అప్పజెప్పాలి రైతులు డిమాండ్.
తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో రైతులు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలను మార్కెట్ కమిటీ అధికారులు అప్పజెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. గత డిసెంబర్ నెలలో గోదాంలో ధాన్యం బస్తాలను నిల్వ ఉంచడం జరిగిందన్నారు.ధాన్యం బస్తాల పై రైతుబంధు రుణాలు తీసుకోవడం జరిగిందని పాత్రికేయులతో తెలిపారు .
ఆ లోన్లను తిరిగి చెల్లిస్తామని అధికారులకు విన్నవించిన అధికారులు సకాలంలో కార్యాలయంలో లేకపోవడంతో రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఆర్డర్ పత్రాలను తీసుకో రావడం జరిగిందన్నారు . రైతుబంధు రుణాలు తీసుకున్న రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం పేరు మీద డిడిలను తీసి రుణాలు తిరిగి చెల్లిస్తామని డిడి రూపంలో తీయడం జరిగిందన్నారు . మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది లేకపోవడంతో రైతుల అగ్రహం వ్యక్తం చేస్తూ కార్యదర్శి పై అగ్రహ వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏఎంసీ కార్యాలయ కార్యదర్శి సకాలంలో వచ్చి రైతులకు న్యాయం చేయాలని గోదాంలో ఉన్న వారి ధాన్య బస్తాలను అప్పజెప్పాలని వారు కోరారు. ఈ ధర్నాలో పాల్గొన్నవారు రైతులు శంకర్ పటెల్, గంగాధర్, నాగనాథ్,బాబు ఖాన్, ఫారూఖ్, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
.