మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని యాద్గర్ పూర్ గ్రామంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ రంగా గౌడ్ కు  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసిల పోరం అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు రాష్ట్ర బంజారా సంఘ నాయకులు ప్రతాప్ సింగ్  ఎంపీటీసీ అనంత విట్టల్ మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు కిషోర్ బాబు బీమా సాయి రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాదు మాల మహానాడు మండల అధ్యక్షులు మీర్జాపూర్ చిన్న సాయన్న మున్వర్ మైతాప్ గైని గంగారం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.