జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కేంద్రంలో పురాని పెట్ సన్ రైస్ తైక్వాండో అకాడెమీలో జరిగిన జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గంను 2024 నుండి 2028 సంవత్సర కాలానికి ఎన్నుకోవడం జరిగింది. 

ఈ ఎన్నికలకు అబ్జర్వర్ గా తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ నుండి జిల్లపల్లి వెంకట స్వామి  మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అడ్వకేట్ పల్లికొండ గంగాధర్ వ్యవహరించారు. ఈ ఎన్నికలకు జగిత్యాల జిల్లాలోని తైక్వాండో కు చెందిన వివిధ క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్ గా మంచాల కృష్ణ ,

నూతన ప్రెసిడెంట్ గా కోల గంగారావు , జనరల్ సెక్రెటరీగా గాదె సంతోష్ , కోశాధికారిగా గందె శ్రీనివాస్ ,వైస్ ప్రెసిడెంట్లుగా డాక్టర్ కె భీమేశ్వర్ , నావనంది రమేష్, ఎండి యాసిన్  సెక్రటరీగా ఎండి సోయబ్ సిద్దిక్ ,జిల్లా మహేందర్ ,ఎండి సలావుద్దీన్ బీసీ మెంబర్ గా ఎన్ శ్రీనివాస్ ,జి రాంప్రసాద్ , బి భాస్కర్, ఏ శివకృష్ణ అథ్లెటిక్ మెంబర్  కే ధరనిధర్ ఎన్నుకోవడం జరిగింది.

కోరుట్ల కి చెందిన మాస్టర్ తైక్వాండో క్లబ్ ఫౌండర్, జనరల్ సెక్రెటరీ నావనంది రమేష్, మెట్ పల్లి కి చెందిన తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు ఎం డి యాసిన్ లు జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ వైస్ ప్రసిడెంట్ గా నియమితులు అయ్యారు.

రమేష్, యాసిన్ లను పలువురు ప్రముఖులు అభినందించారు.

.