వివరాలు వెల్లడించిన కోరుట్ల సీఐ సురేష్ బాబు...
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో కేరళకు చెందిన ఐదుగురు వ్యక్తులు సైబర్ నేరాలుకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్టు కోరుట్ల సీఐ సురేష్ బాబు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన వివరాలు వెల్లడిస్తూ కోరుట్ల పట్టణానికి చెందిన బాశెట్టి శంకరయ్య , సారిక వర్మ పేరుతో శంకరయ్య తోటి మీ యొక్క ఆధార్ కార్డు అక్రమంగా వాడుకున్నందున ముంబైలో మీ మీద కేసు నమోదు అయినదని మీ ఆధార్ కార్డు మనీలాండరింగ్ కేసులో లింకు అయినదని దీనిపై విచారణ జరుగుతుందని ఒక సుప్రీంకోర్టు ఫేక్ నోటీసు పంపి శంకరయ్యను భయభ్రాంతులకు గురిచేసి మీ యొక్క అకౌంట్లోనే డబ్బులు మా అకౌంట్ కు పంపితే వాటిని పరిశీలించిన తర్వాత మీ యొక్క డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పడం జరిగిందని. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని చెప్పగా నిజమని నమ్మిన శంకరయ్య నవంబర్ 2023 సంవత్సరంలో వివిధ అకౌంట్లో మొత్తం 3,23,65000 రూపాయలను పంపించారని మరోసారి కోటి రూపాయలు పంపిస్తే నీ యొక్క కేసు దర్యాప్తు పూర్తవుతుందని, కేసు దర్యాప్తు పూర్తి అయిన తర్వాత శంకరయ్య అమౌంట్ మొత్తాన్ని తిరిగి పంపిస్తామని సైబర్ నేరగాళ్లు చెప్పడంతో శంకరయ్య మరోసారి కోటి రూపాయలు పంపించారని మొత్తం 4,23,65000 రూపాయలు శంకరయ్య పంపారని తెలిపారు.
శంకరయ్య లాప్టాప్ స్క్రీన్ ను షేర్ చేయాలని కోరగా శంకరయ్య లాప్టాప్ స్క్రీన్ షేర్ చేయగా సైబర్ మోసగాళ్లు శంకరయ్య యొక్క లాప్టాప్ ను యూస్ చేసి శంకరయ్య అకౌంట్ లో 20 సంవత్సరాల గల షేర్స్ ఉన్నాయని వాటిని కూడా విత్ డ్రా చేసి పంపాలని సైబర్ నేరగాళ్లు శంకరయ్యను కోరడం జరిగిందని తెలిపారు.
20 సంవత్సరాల షేర్స్ తో మీకేం సంబంధం అని శంకరయ్య అడగగా దానితో సైబర్ మోసగాళ్లు రెస్పాన్స్ ఇవ్వడం ఆపేశారని, సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయానని తెలుసుకున్న శంకరయ్య నవంబర్ 27 2023 కోరుట్ల పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
శంకరయ్య తన అకౌంట్ నుండి మేజర్ గా ఎనిమిది అకౌంట్లకు తన డబ్బులు పంపించారని ఆ యొక్క ఎనిమిది అకౌంట్లో నుండి అందాజ 200 అకౌంట్లకు సైబర్ నేరాగాలు ఆ యొక్క డబ్బులని పంపించడం జరిగిందని తెలిపారు.
దీనితో సైబర్ నెరగాల ఆట కట్టించడానికి జగిత్యాల ఎస్.పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్, సైబర్ క్రైమ్ రంగారెడ్డి డి.ఎస్.పి ఆధ్వర్యంలో కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్, జగిత్యాల సైబర్ క్రైమ్ వింగ్ లో పనిచేసే కానిస్టేబుల్ మహేష్, మేడిపల్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్, కోరుట్ల కానిస్టేబుల్ సంతోష్ లతో ఒక టీం ని ఏర్పాటు చేసి ఈ కేసులో కొంత డబ్బు కేరళ రాష్ట్రంలోని కొంతమంది అకౌంట్లో జమ అయిందని గుర్తించి ఈ యొక్క టీం ను కేరళకు పంపించడం జరిగిందని తెలిపారు.
కేరళకు చెందిన షౌకత్ అలీ, బాసిత్, అజ్మల్, కమ్రుద్దీన్, అక్బర్ సిద్ధికి లను కేరళలో అరెస్టు చేసి అక్కడి కోర్టు నందు హాజరు పరిచి అక్కడి నుండి స్థానిక కోర్టులో హాజరు పరిచిన అనంతరం కరీంనగర్ జైలుకు తరలించినట్లు తెలిపారు. ఇందులో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరిని గుర్తించి, పట్టుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నబడునని తెలిపారు.
ఇట్టి కేసులో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ క్రైమ్ డిఎస్పి రంగారెడ్డి, కోరుట్ల సీఐ సురేష్ బాబు, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్, జగిత్యాల సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేష్, మేడిపల్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్, కోరుట్ల కానిస్టేబుల్ సంతోష్ లను జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.
ఇలాంటి నేరాలే కాకుండా కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరాలు జరుగుతున్నాయి కావున ప్రజలందరూ గమనించి తగు జాగ్రత్తలు వహించి ఇట్టి నేరాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
.