ఘనంగా 133వ అంబేద్కర్ జయంతి

తెలంగాణ  ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గైని వీరేందర్ ఆధ్వర్యంలో 133వ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పంచశీల గీతం ఆలపించి జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం యువత పనిచేయాలని ఆయన యువతకు కోరారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని హక్కులను అనుగుణంగా నడుచుకోవాలని బహుజన బిడ్డలందరికీ తెలియజేశారు.  ఏప్రిల్ నెలలో అంబేద్కర్ జయంతితో పాటు మహానీయుల జయంతులను గ్రామాలలలో  మండల కేంద్రాలలో ఘనంగా నిర్వహించుకుంటారని ఆయన తెలిపారు. లెజెండ్ డీజే అంబేద్కర్ పాటలతో అంగరంగ వైభవంగా విధుల గుండా అంబేద్కర్ ర్యాలీని నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు గంధపురాజు, ధనరాజ్, అంబేద్కర్ సంఘ కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు క్యాషియర్ సభ్యులు ఆయా గ్రామాల అంబేద్కర్ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

.