ముఖ్యమంత్రి సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జువ్వాడి నరసింగరావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో వచ్చే నెల 1న  జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ వేదికను శనివారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  జువ్వాడి నర్సింగరావు, ప్రభుత్వవిప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు లతో కలిసి పరిశీలించారు పట్టణంలోని ప్రభుత్వ పశు వైద్య కళాశాల సమీపంలోని  జాతీయ రహదారి  పక్కన సభా వేదిక ఏర్పాటు చేయనున్నట్లు జువాడి నర్సింగరావు  విలేకరులకు తెలిపారు 

మే 1న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉదయం 11 గంటలకు ఉంటుందని నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు 

ఈ కార్యక్రమంలో జువ్వాడి నర్సింగరావు అడ్లూరి  లక్ష్మణ్ కుమార్ లతోపాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు తో పాటు కోరుట్ల మండల నాయకులు పట్టణ నాయకులు కౌన్సిలర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మైనారిటీ సెల్ నాయకులు ఎస్ సి సెల్ నాయకులు  తదితరులు ఉన్నారు

.