కాంగ్రెస్ పార్టీ గెలుపులో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుంది

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో టిపిసిసి  సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్, స్టేట్ కోఆర్డినేటర్ నవీన్, ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని, ఈ నాయకుడైన తన ప్రసంగాన్ని ప్రజలకు చేరే విధంగా సోషల్ మీడియా క్రియాశీలకంగా పని చేస్తుందని అన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా కృషి చేయాలని అన్నారు .ఈ ఎన్నికల్లో మనం యుద్ధం చేసే సమయం ఆసన్నమైందని ప్రతి ఒక్కరు యుద్ధంలో పాల్గొన్న సైనికుల పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.



ఈ కార్యక్రమంలో రేవంతన్న సైన్యం రాష్ట్ర అధ్యక్షులు నరసింహ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి జిల్లా కోఆర్డినేటర్లు అసెంబ్లీ, మండల, గ్రామ ,కోఆర్డినేటర్లు, కుత్బుల్లాపూర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బత్తిన రామ్ కుమార్ గౌడ్, డాన్ శీను, జహీరాబాద్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాండు, సుజనాకర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

.