తెలంగాణ ప్రభ (కోరుట్ల): గణిత భోదనలో ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు భోదకులు నేర్పించినప్పుడే విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని టీ బీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ అన్నారు.
శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని నేతాజీ వృత్తి విద్యా కాలేజీ సమావేశ మందిరంలో ప్రముఖ గణిత శాస్తవ్రేత్త శ్రీనివాస రామానుజన్ వర్ధంతి వేడుకలను నిర్వహించి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హరి ఆశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గణిత భోదనలో నిష్ణాతులైన అధ్యాపకులను హరి ఆశోక్ కుమార్ చేతుల మీదుగా కాలేజీ యాజమాన్యం సన్మానించారు.
అనంతరం హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ గణిత సమస్యలను సులభంగా చేసేందుకు నేతాజీ కాలేజీ ప్రిన్సిపాల్ బి.గంగాధర్ రూపొందించిన భోదన పద్ధతులను అభినందించారు.
ప్రస్తుత పోటీని తట్టుకోవడానికి కొత్త విధానాలను అన్వేషించి గణిత అధ్యాపకులు అమలు చేసినప్పుడే విద్యార్థులు తమ ప్రతిభను చాటుకొనే అవకాశం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో నేతాజీ కాలేజీ కరెస్పాండెంట్ సింగం భాస్కర్,ప్రిన్సిపాల్ గంగాధర్,టీ బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బండారి విజయ్,మహిళా జేఏసి జిల్లాఅధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి, పెన్షనర్స్ అస్సోసియేషన్ జిల్లా కార్యదర్శి బొల్లం విజయ్, ఉపాధ్యక్షుడు వెలుముల ప్రకాష్ ,సీనియర్ సిటీజేన్స్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టీ విశ్వనాథం, అధ్యాపకులు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా విద్యార్థి జేఏసీఅధ్యక్షుడు ధోనూరి భూమాచారి, తదితరులు పాల్గొన్నారు.
.