ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రతిభ చాటిన అజయ్

ఇంటర్ సిఇసి ప్రథమ సంవత్సరం లో 449 మార్కులు. 

తెలంగాణ ప్రభ ( సిరిసిల్ల): ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన నేపథ్యంలో మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బిసి వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీలో లో చదువుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన విద్యార్థి గొర్రె అజయ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో సీఈసీ గ్రూపులో 449 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రేరణతో తాను ప్రథమ స్థానంలో నిలిచేందుకు అవకాశం కలిగిందని అజయ్ అన్నారు. ప్రిన్సిపాల్ శ్రీనాథ్, వీర ప్రభాకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టుదలతో చదివితే మంచి ఫలితం సాధించవచ్చు ఈ సందర్భంగా అజయ్ సహా విద్యార్థులను కోరారు.

.