తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) సుభాష్ నగర్ డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్ (రాజీవ్ గృహకల్ప) వద్ద దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహనీయుల జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో అక్షర జ్యోతిని వెలిగించడం ద్వారానే జ్ఞాన జ్యోతి వెలుగుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే వంటి మహనీయుల త్యాగాల ఫలితమే నేటి మన జీవన గమనమన్నారు. అటువంటి మహానీయులను ఎప్పటికీ మర్చిపోవద్దు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, నిర్వాహకులు గౌనీ శంకర్, తారా సింగ్, కరాటే శీను, కుమార్,జేమ్స్, గట్టు అశోక్, వీరేశం, శ్రీ పాల్ తదితరులు పాల్గొన్నారు.
.