బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం

తెలంగాణ ప్రభ  (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని  జహీరాబాద్ పార్లమెంట్‌  బీజేపీ  అభ్యర్థి బిబి పాటిల్ ను  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ  ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. నరేంద్రమోదీని మరోసారి ప్రధానమంత్రిని  చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జహీరాబాద్ పార్లమెంట్‌ అభ్యర్థి బిబి పాటిల్ ను గెలిపించి నరేంద్ర మోది కి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజలు బీజేపీకి ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ,బూత్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు ,శక్తి కేంద్రం ఇంచార్జీ లు,మండల కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

.