నేడే సయ్యద్ షా రాజన హుస్సేన్ దర్గా సందాల్

సైదు రాజులు గుడి  దర్గా సందాల్.( గంధాలు).

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని పాత ఎక్లాస్ పూర్  వెళ్లే ప్రధాన రహదారి పక్కన రోజా పూర్ శివారులో ఉన్న  (సైదు రాజుల గుడి సందాల్) సయ్యద్ షా రాజున హుసేని దర్గా  వద్ద శుక్రవారం నాడు ప్రారంభమైతున్నాయని దర్గా పెద్దలు పాత్రికేయులతో తెలిపారు. పవిత్ర మాసమైన రంజాన్ పండగ జరుపుకున్న తర్వాత 16 లేదా 17 రోజులలో ఈ దర్గా వద్ద  ప్రత్యేక పూజలు చేసి సందాల్ గ్రంథాలను  పండుగ. వాతావరణం లో ఏర్పాటు చేసుకొని  ఘనంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. మాజీ సర్పంచ్  హైమద్    హుస్సేన్ ఇంటి నుండి సందాల్ బయలుదేరి దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గ్రంథాలను ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా గ్రంధాలను నిర్వహించడం జరుగుతుందని దర్గా యాజమాన్యం కమిటీ సభ్యులు తెలిపారు. సందాల్ గంధాలు శుక్ర శని వారాలలో నిర్వహిస్తామని అన్నారు మండలంలోని చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సందాలను   విజయవంతం చేయాలని దర్గా యాజమాన్య కమిటీ సభ్యులకు కోరారు.

.