కోరుట్ల మండల బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం - అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం

ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి...

ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు 

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన బూతు స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు లు విచ్చేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం చేయాలని అందుకు అనుగుణంగా బూతు కమిటీలను వేసుకోవాలని బూతు స్థాయి కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించాలన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి వాటిని ప్రజలకు చేరవేయాలన్నారు 

గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేసిన హామీలను ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు 

గతంలో బీడీ కార్మికులకు పీఎఫ్ కట్ ఆఫ్ తో సంబంధం పెట్టి పెన్షన్లు ఇచ్చారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తామన్నారు బ్రతుకుతెరువు కోసం గల్ఫ్ వెళ్ళే కార్మికుల సమస్యలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని, గల్ఫ్ లో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రతి నియోజకవర్గంలో 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టనున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారుల వివరాలు సేకరించాలని సూచించారు ప్రతి బూత్ కు నలుగురు ఇన్చార్జీలను నియమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రతి బూతు స్థాయి నాయకుల నుండి కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి గెలుపు కృషి చేయాలన్నారు 

మత విద్వేషాలు రెచ్చగొట్టే అభ్యర్థులను గెలవకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలు బూతు స్థాయి ఇన్చార్జిలపై ఉందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు తమ విజయాన్ని చూసుకోవాలని పిలుపునిచ్చారు 

గెలిపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు వ్యవసాయం అనేది రైతుకు బతుకుతెరువు లాంటిదని దీనిపై ఏ పార్టీ ఆచరణ ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజేయాలన్నారు ధాన్యము మద్దతు ధర కల్పించడమే కాకుండా దాని అమలుకు సైతం పర్యవేక్షించాలని పెట్టుబడి ధరను పెంచిన బిజెపి ఆదాయం పెరగడం కాదు అప్పుల్లోకి వెళ్తున్న రైతులను గురించి ఆలోచించాలన్నారు 

ఏక మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఇది రైతులకు స్పష్టంగా వివరించాలన్నారు రాబోయే ఖరీఫ్ నాటికి రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని అంతేకాకుండా పండించిన వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ కూడా తప్పకుండా ఇస్తామన్నారు బిజెపి పాలిత ప్రాంతాల్లో పెట్టుబడిదారులకు రుణమాఫీ ఎక్కడైనా చేస్తుందని ప్రశ్నించారు ఐదు ఎకరాల వరకు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎలాంటి సహాయాలు కూడా అందడం లేదని అలాగే గల్ఫ్ కార్మికులు మృతి చెందితే ఎలాంటి సేవలు కూడా అందించడం లేదన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం గల్ఫ్ లో మృతి చెందిన ప్రతి కార్మికుని కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నామన్నారు 

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికులకు అండగా ఉన్నామన్నారు 

ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోని బిజెపికి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించాలన్నారు 

స్వర్గీయ మాజీ మంత్రి రత్నాకర్ రావు గొప్ప నాయకుడని రాజకీయాల్లో తనతో పోటీపడి ఎక్కడా లేనివిధంగా కోరుట్ల నియోజకవర్గానికి పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు 

అనంతరం అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బూతు స్థాయి నాయకులను ఇప్పటినుండే తమ కార్యాచరణ రూపొందించుకొని గెలుపుకు అనుకూలంగా ఓటర్లను మలుచుకునే విధంగా కృషి చేయాలన్నారు 

గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను మళ్లీ జరగకుండా చూసుకోవాలన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ పార్టీ అని గత ఎన్నికల హామీలు ఇచ్చిన హామీలను వంద రోజుల్లోనే నాలుగు హామీలను నెరవేర్చడం జరిగిందని పార్లమెంటు ఎన్నికల అనంతరం మిగతా హామీలను కూడా తప్పకుండా నెరవేరుస్తామని దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు 

జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలుపు కోసం బూతు స్థాయి నాయకులు సైనికుల్లా పనిచేసి జీవన్ రెడ్డిని గెలిపించాలని ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు గల యువతను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మార్చుకునే విధంగా బూతు స్థాయి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు 

కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డికి భారీ మెజార్టీ ఇచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటుపై ఎక్కువ నమ్మకంతో ఉన్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగిత్యాల పార్లమెంటు అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించడమే కాకుండా జగిత్యాల కంటే కోరుట్లలో ఎక్కువ మెజార్టీని ఇచ్చే విధంగా కృషి చేయాలని కోరారు అలాగే బార్ అసోసియేషన్ భవన నిర్మాణం కోసం జీవన్ రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా గెలిస్తే 25 కోట్ల నిధులు సంఘ అభివృద్ధికి మంజూరు అవుతాయన్నారు 

కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని అందులో ముఖ్యంగా పేదల కోసం జీరో బిల్ ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడకం జరుగుతుందన్నారు కోరుట్ల నియోజకవర్గంలో 3500 డబుల్ బెడ్ రూమ్ ఇండకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా అయిలాపూర్ గ్రామంలో కోరుట్ల మండలంలోని ఎక్కువ జనాభా ఉంటుంది కావున అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు గడిచిన ఐదు సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 2 ఆలయాలలో కనీస విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయలేని ఎంపీ అరవింద్ ఓటు బ్యాంకు రాజకీయం కోసం రామున్ని వాడుకుంటున్నాడని దీనిని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 85 లక్షల రూపాయల నిధులు తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి మంజూరు చేయడం జరిగిందన్నారు కావున ప్రజలు గమనించాలని పనిచేసే నాయకుని ఎన్నుకోవాలని కోరారు 

చేన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం జరిగిందని తన కోరిక కూడా అదేనని అందుకే అందులో చేరానన్నారు గల్ఫ్ కార్మికుల సమస్యలు చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ బీడీ కార్మికులకు పెన్షన్ గల్ఫ్ బోర్డు ఏర్పాటు వంటి వాటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని, కావున పార్లమెంటు ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తో పాటు మరో మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా తప్పకుండా పున ప్రారంభమవుతాయని కావున ప్రజలు జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు తాను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని తనకు ఏ బూతు అప్పజెప్పినా ఆ బూతులు అధిక మెజార్టీ తీసుకువచ్చే విధంగా తాను కృషి చేస్తానని ఆయన తెలిపారు 

పసుపుకు మద్దతు ధర అడిగితే పసుపు బోర్డు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిన అరవింద్ కు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు 

ప్రస్తుతం పసుపు విస్తీర్ణం తగ్గడం వల్లే పసుపు ధర పెరిగిందని ఆయన తెలిపారు 

గతంలో తాను పెద్దాపూర్ గురుకులంలో చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్లాలంటే కనీసం  రోడ్డు లేని పరిస్థితులలో అప్పుడు జీవన్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉండగా తమకు రోడ్డు కావాలని అడిగిన వెంటనే రోడ్డు వేయించిన గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి అని అలాంటి నాయకున్ని ఎన్నుకుంటే అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుందని ఆయన తెలిపారు 

కావున ప్రతి ఒక్క బూతు స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన కోరారు 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్తిని అనిల్ కుమార్, అకారపు భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరంచంద్, కల్వకుంట్ల సుజిత్ రావు, చెన్నమనేని శ్రీనివాస్ రావు, జంగిలి వెంకటి, కిసాన్ జిల్లా అధ్యక్షులు జలపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, అల్లూరి మహేందర్ రెడ్డి, ఆకుల లింగారెడ్డి, కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి,  చింతకుంట సంజీవరెడ్డి, పన్నాల అంజిరెడ్డి, నక్క సుధీర్, ఎం పి టి సి లు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జెట్టి లింగం, బర్ల సాయన్న, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.