తెలంగాణ ప్రభ (కోరుట్ల): పీ.ఆర్.సి.కమిషనర్ తో తమ తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ర్ట అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో చర్చించిన పెన్షనర్ల ప్రయోజన విషయాలను ఆ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ సంఘ ప్రతినిధులకు వివరించారు.
గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
40 శాతం పైగా ఫీట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వంనకు సిఫార్సు చేయాలని ,పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్య,వైద్యం,వంటి అత్యవసర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని 2023 జులై నుండి పెండింగులో ఉన్న మూడు డి.ఏ.లు కలిపి మొత్తం 44 శాతం ఫీట్మెంట్ కు తగ్గ కుండా సిఫార్సు చేయాలని కోరామన్నారు.
అదేవిదంగా అన్ని కార్పోరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించాల్సిన అవసరం పై,పెన్షన్ కమ్యూటేషన్ సైతం 15 ఏళ్లనుండి 12 ఏళ్లకు తగ్గించాలని సిఫార్సు చేయాలన్నారు
కనీస పెన్షన్ రూ.30 వేలు ,అంత్యక్రియల ఖర్చులు రూ.60 వేలకు పెంచాలని,వైద్యభత్యం రూ.600 నుంచి రూ.6 వేలకు పెంచాలని,65 ఏళ్ళకే క్వాంటం పెన్షన్ మంజూరు,గ్రాట్యుటీ రూ.30 లక్షలకు పెంచాలని, అన్ని జిల్లా కేంద్రాల్లో వెల్ నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని,అన్ని జిల్లా కేంద్రాల్లో టీ ఉద్యోగుల జేఏసి,ప్రభుత్వ గుర్తింపు పొందిన తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా శాఖలకు ప్రభుత్వమే భవనాలు నిర్మించి ఇవ్వాలని, తదితర పలు అంశాలపై చర్చించగా పీ ఆర్.సి.కమిషనర్ శివశంకర్ సానుకూలంగా స్పందించి నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు వెలుముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శిలు పి.ఆశోక్ రావు,సత్యనారాయణ, మహిళా కార్యదర్శిలు కరుణ,విజయ లక్ష్మి,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శిజీ.రాజ్ మోహన్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,వివిధ మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.