ప్రపంచ మలేరియా దినోత్సవం పై అవగాహన ర్యాలీ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలంలోని పోతంగల్ మండల కేంద్రంలో  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి బస్టాండ్ వరకు ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలతో కలసి ప్రపంచ మలేరియా దినోత్సవం పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.  ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమం  సందర్భంగా  మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి గోవర్ధన్ మాట్లాడుతూ.. దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలన్నారు, వాటి వలన పలు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు తెలియజేశారు. మలేరియాను తరిమికొడాద్దామని గ్రామస్తుల కు తెలియజేశారు. ఇంటి యజమానులతో మాట్లాడుతూ  ఇంటి పరిసరాలలోని నీటి నిలువలు ఉండకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. 2030 సం.నాటికి మలేరియా నిర్మూలనకు మనమందరం  కలిసి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరణ్, సూపర్వైజర్ జ్యోతి, ఏఎన్ఎంలు  ప్రమీల,రాజమని, ఏంఎల్.హెచ్.పిలు. ఆశా కార్యకర్తలు కళావతి రేఖ తదితరులు పాల్గొన్నారు.

.