తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్ పురి కాలనీలో మంగళవారం నిర్వహించిన, ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనని, ఎంపీ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నట్లయితే అభివృద్ధి పెట్టి వేగంతో జరుగుతుందన్నారు. కావున మే 13న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలుకుల జగన్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, క్రమశక్తి అవార్డు గ్రహీత ఎత్తరి మారయ్య, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్, హజరత్ అలీ, శ్రీను, పాపులు గౌడ్, రాములు, జైహింద్, మల్లారెడ్డి, నర్సింగ్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
.