తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని దేవునిగుట్ట తాండ మెగావత్ సోమ్లానాయక్ దంపతుల కుమార్తె సింధు వివాహ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని నూతన వధువరులకు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కొత్తపల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సుదర్శన్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం అశోక్ రెడ్డి,పుండలిక్ రావు, గ్రామ ఉపాధ్యక్షులు రేని సాయిలు, ఇట్టే గంగారం పల్లపురాజు, పుప్పల వీరేశం తదితరులు పాల్గొన్నారు.
