తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలో ఆదివారం నాడు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతంగల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్ మాట్లాడుతూ.. శనివారం జరిగిన ఎంపీ ఎలక్షన్లో రోడ్ షో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ బిల్లులు ఇవ్వలేకపోతే ప్రాణా త్యాగం చేస్తాని మాట్లాడటం సబాబు కాదన్నారు. 11 వేల మందిలో ఎంత మంది లబ్ధిదారులకు బిల్లులు ఇచ్చారో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేరని ఏదో మనోభావానికి గురై ఇష్ట రాజ్యాంగ మాట్లాడం సరికాదన్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ పేరు చెప్పి ఇసుక దోచుకున్న వ్యక్తులు మీ నాయకులు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు .పోతంగల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లోకి వెళ్దాం రండి బిల్లులు ఎక్కడ నిలిచిపోయాయో ఎవరి వద్ద ఉన్నాయో లబ్ధిదారులే చెప్తారని అని మండిపడ్డారు. ఈ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న వారు గ్రామ కమిటీ అధ్యక్షులు ఫుల్కంటి సాయిలు డిసీసీ డెలిగేట్ సుంకిని హనుమంతు బజరంగ్ దత్తు వీరుకొండ మైనార్టీ నాయకులు ఆయా గ్రామాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
