బాదురుపల్లి లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేసిన : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్ పల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద  ముఖ్యఅతిథిగా హాజరై కలియుగ శ్రీనివాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  మాట్లాడుతూ కలియుగ శ్రీనివాసుడి దయ, కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకులు పివి కృష్ణారావు, దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, కౌన్సిలర్లు భరత్, నవనీత మల్లేష్, సీనియర్ నాయకులు సగ్గిడి శ్రీనివాస్, బాలరాజు యాదవ్, కృష్ణ యాదవ్, నాయికోటి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

.