తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచనల మేరకు కోరుట్ల డివిజన్ కేంద్రంలోని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ కార్యాలయం కౌన్సెలింగ్ కేంద్రంలో సీనియర్ సిటీజేన్లకు,పెన్షనర్లకు ఆదివారం ఓటింగ్ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా 85 ఏళ్ళు నిండిన వయోధికులకు ,40 శాతం పై బడిన అంగవైకల్యం ఉన్న వారికి ఇంటి నుంచే ఓటింగ్ సౌకర్యం ఉందని, ఫారం 12 డి ద్వారా దరఖాస్తు చేసుకొని 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఇంటి నుంచే ఓటు కార్యక్రమంను తగు సౌకర్యాలు కల్పించి, పకడ్బందీగా అమలు చేసిన విషయాన్ని ఆయన వివరించారు.
100 శాతం ఓటింగ్ చేయాలని ఎలాంటి ప్రలోభాలు లేకుండా భయం లేకుండా భేద భావం లేకుండా ఓటు వేయాలని, ఓటు అనేది ఓటర్ వజ్రాయుధమని,ఓటు విలువను గుర్తించుకొని ప్రతి ఒక్కరు ఓటు వేసేట్లు తమ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్ల డివిజన్ల,మండల,గ్రామాల ప్రతినిధులకు సూచనలు చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేసిన సీనియర్ సిటీజేన్లను,పెన్షనర్లను హరి ఆశోక్ కుమార్ సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సిటీజేన్స్ కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి గంటేడి రాజ్ మోహన్, ఉపాధ్యక్షుడు ఎం.డి.సైఫోద్ధిన్ ,కోశాధికారి నల్ల లక్ష్మీ నారాయణ,రాజయ్య,లక్ష్మీకాంతం,అల్లూరి బాపురెడ్డి,గంగారాం శనిగారపు చిన్నమల్కయ్య,,గోపం శ్రీరాములు, కోరుట్ల,కథలాపూర్,మేడి పల్లి మండలాల సీనియర్ సిటీజేన్స్,పెన్షనర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
.