రాధాకృష్ణుల కళ్యాణం లో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వడి కృష్ణా రావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో శ్రీ సత్యానంద మహర్షి ఆశ్రమంలో ఆదివారం జరిగిన రాధాకృష్ణల కళ్యాణోత్సవంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, మేకల నరసయ్య, ఎంపీటీసీ సభ్యురాలు వనిత సంజీవరెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బండ్ల సరోజన, మాజీ కేడీసీసీ డైరెక్టర్ నాగునూరి గంగాధర్ గౌడ్, అంజిరెడ్డి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

.