తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ బూర్ల నరేశ్, కరీంనగర్ కు చెందిన కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ గుండా శ్రీనివాస్ లు రచించిన "బేసిక్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడాలజీ & ప్రాజెక్ట్ రిపోర్ట్ "పుస్తకాన్ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజేస్, హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ మూర్తి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ పరిశోధన పరిజ్ఞానం అవసరమని ఈ పుస్తకం తెలంగాణలోని అన్ని విశ్వ విద్యాలయాల
బి. కామ్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వై. రామ కృష్ణ, వి.శ్రీకాంత్, అనంత కుమార్, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తక రచయిత డా . బూర్ల నరేష్ కు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. వాసవి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం అభినందనలు తెలియజేశారు.
.