తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల వాసవి వెల్ఫేర్ వనితా శక్తీ ఆధ్వర్యం లో స్థానిక కోటి నవదుర్గా ఆలయం దుర్గా దేవికి మన అమ్మకు మన సారా మన శారే..కార్యక్రమం నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా పలు ఆలయాల్లో అమ్మ వారికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భం గా ప్రముఖ వ్యాపార వేత్త ఎలిమి నర్సింహ గుప్తా, లక్ష్మి దంపతులు..చీర, శారె, ఓడి బియ్యం సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యెక పూజలు నిర్వహించారు.
అనంతరం మహిళలు సాముహిక లలితా పారాయణం చేశారు.
ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ సభ్యురాలు నీలి అనురాధ, కొత్త శోభ రాణి,మంచాల పద్మ ,దొంతుల రాధిక,మేడి వజ్రమాల, నీలి లక్ష్మి, నీలి స్వప్న, నీలి గాయత్రి, బూస మాధురి, నీలి శ్రీదేవి,నీలి రమా, తదితరులు పాల్గొన్నారు.
.