ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్):  మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని శనివారం తన నివాసం వద్ద పలు బస్తీలకు చెందిన ప్రజలు, నాయకులు, వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి, పలు ఆహ్వాన పత్రికలు అందజేశారు. పలు సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్థానికంగా ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని, బస్తీల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

.