తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) భారతదేశంలో సనాతన ధర్మంపై అన్యమతస్తులు కొన్ని వందల సంవత్సరాలుగా నానా రకాలుగా దాడులు చేస్తున్నా ఇంకా సనాతన ధర్మం ఫరిడవిళ్ళుతుంది అంటే అందుకు కారణం బ్రాహ్మణులే అని, అలాంటి బ్రాహ్మణులను అవమాన పరచడం హేయమైన చర్య అని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక వివాహ తంతులో ఒక బ్రాహ్మణుని పలు రకాలుగా అవమానపరుస్తూ వైరల్ అవుతున్న వీడియో పట్ల గోగులపాటి కృష్ణమోహన్ స్పందించారు.
అగ్రవర్ణాలుగా గుర్తించబడిన బ్రాహ్మణులు అణగారిన వర్గంగా జీవిస్తున్నారని. రిజర్వేషన్ల పుణ్యమా విద్యా ఉద్యోగాలకు దూరమైన బ్రాహ్మణులు ముఖ్యంగా కులవృత్తి మీద ఆధారపడ్డ వారు జీవితం గడపడం చాలా దుర్భరంగా మారిందని. వీటికి తోడు సంఘంలో అవమానాలు ఎక్కువయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాలు టీవీ సీరియల్ లో బ్రాహ్మణులను జోకర్లుగా చూపిస్తూ అవహేళన అపహాస్యం చేస్తుండడమే ఆకతాయిలకు అవకాశం గా మారిందని, బ్రాహ్మణులపై కక్ష సాధింపు చర్యలు అవమానాలు ఇలాగే కొనసాగితే బ్రాహ్మణ అట్రాసిటీ కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
పై సంఘటన పట్ల ఆవేదన వ్యక్తపరుస్తూ దోషులను గుర్తించి న్యాయపరమైన చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
.