తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐదవ తరగతిలో ప్రవేశాలకు లక్కీ డ్రా ద్వారా విద్యార్థులకు ఎంపిక చేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ బషీరుద్దీన్,ఉమ్మడి జిల్లాల విజిలెన్స్ ఆఫీసర్ షేక్ హైమద్ జియాద్ తెలిపారు. నాన్ మైనార్టీ కోటాలో భాగంగా లక్కీ డ్రా లో ఎస్సీ 5 సీట్లు, ఎస్టి 3 సీట్లు, బీసీ 10 సీట్లు రావడం జరిగిందన్నారు. ఎంపికైన విద్యార్థులు వారి సంబంధిత పత్రాలను ఏప్రిల్ 23న పాఠశాలలో అందజేయాలని తెలియజేశారు. ఈ లక్కీ డ్రా ద్వారా విద్యార్థులు ఎంపికైన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్, పి. శివకుమార్, షాపి, ఏ. శివకుమార్ ,సౌజన్య, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
