తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే గంగమ్మ దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు హాజరై ముగ్గు పోసినారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ నుండి గుడి నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. అనంతరం గంగపుత్ర సంఘ సభ్యులు కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిల్ల సురేష్ గౌడ్ ఆలయ నిర్మాణానికి పదివేల 16 రూపాయల విరాళంగా అందజేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం,నాయకులు తుకారం, ముక్కెర లింబాద్రి, శ్రీను, రాజం, గోపు ప్రసాద్, సురేష్, సామల కోటేష్, రమేష్, గంగపుత్ర సంఘ సభ్యులు నరసయ్య, గంగాధర్ ,నాగేష్, సత్యనారాయణ, లక్ష్మణ్, శంకర్, తుక్కయ్య, గోవర్ధన్, నరేష్ మరియు గంగపుత్ర యూత్ సభ్యులు గ్రామంలోని అన్ని కుల సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
.