కోటగిరిలో మెగా హెల్త్ క్యాంపుకు అపూర్వ స్పందన

భారీగా తరలివచ్చిన జనం.

తెలంగాణ ప్రభ( కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్  లైన్స్  క్లబ్ ఆఫ్ కోటగిరి డైమండ్ తెల్ల రవికుమార్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపుకు అపూర్వస్పందన లభించింది.ఈ క్యాంప్ నందు  సుమారు 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని చావిడి వద్ద మెగా హెల్త్ క్యాంపును లైన్స్ గవర్నర్ పోలవరపు లక్ష్మీ బసవేశ్వర రావు, కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి నాయకులు వల్లేపల్లి శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఎంపీటీసీ మనోహర్ సొసైటీ చైర్మన్ కూచి సిద్దు బీమా సాయి రెడ్డి గాండ్ల శ్రీనివాస్ కొల్లూరు కిషోర్ సిపిఐ నాయకులు విట్టల్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికి రక్త పరీక్షలు మధుమేహం పరీక్షలు బీపీ పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధమైన వ్యాధులు కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం పట్ల నేతలు  లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ అధ్యక్ష కార్యదర్శులకు సభ్యులకు అభినందించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షల కోసం పట్టణాలకు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత ఊర్లోనే వైద్య పరీక్షలు ఏర్పాటు చేసి మందులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు .ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్ దేశాయ్ జుబేర్ అహ్మద్ తెల్ల చిన్న అరవింద్ గర్దాస్ ఆనంద్  బాబు ఖాన్ అనంత విటల్ ,అరుణ్ గౌడ్ ,  గంగా ప్రసాద్ గౌడ్ ,సాబీర్ జలాల్ శివచరణ్ లైన్స్ క్లబ్ ప్రతినిధులు హనుమంతరావు పటేల్, కప్ప సంతోష్, పెద్ద కాపు శ్రీకాంత్, యోగేష్ బాన్సువాడ హనుమాన్లు  వీరేశం వినోద్ పటేల్ అర్పిత్ వర్షిత్ కూచి సాయిబాబు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్యుల బృందం వైద్య సిబ్బంది ఆరోగ్య సూపర్వైజర్ జ్యోతి ,ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

.