తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్.
తెలంగాణ ప్రభ (కోరుట్ల): వేతన సవరణ కమిషనర్ శివశంకర్ ఆహ్వానం లేఖ నెంబర్ .04/పి.ఆర్.సి.1/2023-6 తేదీ.1-04-2024 ద్వారా ఆహ్వానించిన మేరకు తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ బి.ఆర్.కె.భవన్ లో కలిసి వేతన సవరణలో ఆమోదించవలసిన అంశాలపై చర్చలు జరిపినట్లు ఆ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు. చర్చించిన అంశాలను పెన్షనర్ల సమాచారం కోసం ఆయన వివరించారు.
ఫీట్మెంట్ 40 శాతం తగ్గకుండా ఇవ్వాలని,పెండింగులో ఉన్న 3 డి.ఏ.లను విడుదల చేయాలని,గ్రాట్యుటీ 16లక్షల నుండి 20 లక్షలకు పెంచాలని,అడిషనల్ ఖ్వాంటము పెన్షన్ 65 ఏళ్ల వారికి 15 శాతం ఆదనముగా చెల్లించాలని,ఇట్టి పెన్షన్ 65 ఏళ్ళు నిండిన మొదటి తేదీనే చెల్లించాలని, అంత్యక్రియలకు రూ.50 వేలు మంజూరు చేయాలని,ఈ కుబేర్ పథకం రద్దు చేయాలని, వేములవాడ,భద్రాచలం,యాదాద్రి దేవాదాయ పెన్షనర్లకు,గ్రంధాలయ,వాటర్ వర్క్స్,మార్కెట్ కమిటీల,సహకార సంస్థలు,సింగరేణి కాలరీస్ పెన్షనర్లకు ప్రభుత్వ పెన్షనర్స్ మాదిరిగా నగదు రహిత ఆరోగ్య కార్డులను ఇవ్వాలని,ఒక శాతం కంట్రిబ్యూషన్ తో పరిమితి లేకుండా అన్ని కార్పోరేట్,ప్రభుత్వ నిమ్స్ తదితర ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యసేవలు అందించేలా ఉత్తర్వులు జారీ చేయాలని,వైద్య అలెవెన్సులు రూ.2000 ప్రతి నెలా చెల్లింపునకు ,తదితర ప్రయోజన డిమాండ్స్ ఆమోదించాలని వేతన సవరణ కమిషనర్ కు వివరించినట్లు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య,ప్రధాన కార్యదర్శి నవనీత రావు, రాష్ట్ర కార్యదర్శి,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్,కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, కార్యదర్శి లింగయ్య,రాష్ట్ర,జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
.