తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నివసిస్తున్న కడార్ల మౌనిక రాజశేఖర్ దంపతులకు ఏప్రిల్ 16వ తేదీన పూర్తి 9 నెలలు నిండకుండానే చిన్నారి జన్మించింది.
కోరుట్ల పట్టణానికి చెందిన మౌనిక జగిత్యాల రాజశేఖర్ తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.
చిన్నారి తల్లి మౌనిక 8 నెలల గర్భిణీ అధిక రక్తస్రావం కావడంతో తల్లి లేదా కూతురు ఎవరో ఒకరు మాత్రమే భద్రంగా ఉండే అవకాశం ఉందని వైద్యులు తెలపడంతో హుటాహుటిన కరీంనగర్ లోని శాలిని హాస్పిటల్ కు తరలించారు.
నలుగురు వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి తల్లిని సురక్షితంగా కాపాడి చిన్నారికి జన్మనిచ్చారు. చిన్నారి పుట్టిందన్న ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకుండానే దంపతులకు పాప ఎనిమిది వందల గ్రాములు మాత్రమే పుట్టిందని ఆమెను రెండు నెలలు వెంటి లెటర్ పై ఉంచాలని సుమారు 8 నుండి 10 లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురవడంతో పేదరికంతో ఉన్నవారు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తూ తమ పాపను కాపాడుకోవడానికి గొప్ప మనసున్న వ్యక్తులు సహకరించాలని పత్రికా ముఖంగా, సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ చిన్నారిని ఎలాగైనా కాపాడుకోవాలని వారు చేసే ప్రయత్నాలు పలువురిని కంటతడు పెట్టిస్తున్నాయి.
ఈ సందర్భంగా మౌనిక రాజశేఖర్ దంపతులు చిన్నారిని రెండు నెలలపాటు వెంటిలేటర్ పై ఉంచాలని ప్రతి రోజు 20వేల పైనా ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేసినట్లు మౌనిక రాజశేఖర్ దంపతులు పేర్కొన్నారు.
తమ కూతురు కోసం సహాయం చేసేవారు 9492107960 ఈ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ పే లేదా గూగుల్ పే తో తమకు తోచిన సహాయం చేసి తమ చిన్నారిని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
.