శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన జువ్వడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన నిమ్మల శ్రీనివాస్ తండ్రి నిమ్మల సాయన్న  బుధవారం రాత్రి మృతిచెందగా గురువారం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు వారి గృహానికి వెళ్లి నిమ్మల సాయన్న  మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్  ను కుటుంబ సభ్యులను ఓదార్చారు.

కృష్ణారావు వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, పట్టణ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి,  మాజీ కౌన్సిలర్ హమీద్, బలిజ శివ తదితరులు ఉన్నారు.

.