పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఒక పేదింటి ఆడబిడ్డ పెళ్ళి అని మీవంతు ఏమైనా సహాయం చేయమని అడగగానే పెద్దమనసు చేసుకొని ముందుకు వచ్చి శ్రీ పోతుగంటి శ్రీనివాస్ మరియు వారి మిత్రబృందం ఆర్ధిక సహకారంతో పెళ్ళి కూతురు వారి తల్లికి ఈరోజు బీరువా, పరుపులు,2కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుల్ ఈరోజు మదర్ లవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందచేయడం జరిగింది.

దీనితో పెళ్ళి కూతురు మరియు వారి తల్లి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ,ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. పోతుగంటి శ్రీనివాస్ మరియు వారి బృందానికి మదర్ లవ్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

.